Shamshabaad Airpot లో ఎబోలా అలెర్ట్ కట్టుదిట్టమైన స్క్రినింగ్ -మంత్రి దామోదర ఆదేశాలు

Shamshabaad Airport లో (Ebola Virus)అలర్ట్ ప్రయాణికులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కట్టుదిట్టమైన స్సీర్నింగ్ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మల్లి ఒక వైరస్ భయపెడుతుంది. అదే (Ebola Virus)వ్యాప్తి ఇప్పుడు భారతదేశం లోని తెలంగాణాలో వచ్చిందని తెలంగాణరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.అయితే ఎవరైతే విదేశాల నుంచి మరి ముక్యంగా ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ద్వారా ఆ వైరస్ మనరాష్టం లోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలో భాగంగా హైదరాబాద్ లోని Shamshabad Airport వద్ద తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహా అధికారులతో సమీక్షా నిర్వహించి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు Shamshabad Airport లో స్సీర్నింగ్ పరీక్షలు నిర్వహించాలని వచ్చిన వారిని అక్కడే కట్టుదిట్టం చేయాలని అన్నారు.అలాగే అక్కడ హై అలెర్ట్ ప్రకటించారు.

Shamshabaad Airpot లో ఎబోలా అలెర్ట్ కట్టుదిట్టమైన స్క్రినింగ్ -మంత్రి దామోదర ఆదేశాలు
Health Minister Daamodhara Raja Narsimha

Airport లో  పెరిగిన నిఘా.. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. 

మన దేశానికి విదేశాల నుంచి వస్తున్న ప్రతి ప్రయాణికులపై తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.ప్రత్యేకంగా ఎబోలా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న దేశాల నుంచి మన తెలంగాణ లోని హైదరాబాద్ లోని Shamshabad Airport కు చేరుకునే ప్రతి ప్రయాణికులకు తప్పకుండ థర్మల్ స్సీర్నింగ్ చేయాలి అని ఆరోగ్యశాఖ అధికారులు అన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎవరికైనా జ్వరం,కండరాల నొప్పి,తల నొప్పి వంటి లక్సనాలు కనిపిస్తే వారిని వెంటనే ఇసొల్యూషన్ వార్డులకు పంపేలా ఏర్పాట్లు చేసి ఉంచారు.

మన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ మన తెలంగాణ ప్రజల ఆరోగ్య విషయం లో ఎలాంటి పరిస్థితిలోను కూడా రాజి పడే ప్రసక్తి లేదు అని అన్నారు.విదేశాల నుంచి Shamshabad Airport లో కి వస్తున్న ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు నిర్వహించాలి.వారిలో ఎవరిపైన అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గాంధీ హాస్పిటల్ కు లేదా ఫీవర్ హాస్పిటల్స్ కి తీసుక వెళ్లే ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

Ebola Viras అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? 

Ebola Viras అనేది చాలా ప్రమాదకరమైనది.ప్రాణాంతకరమైనది.ఇది ప్రత్యేకంగా జంతువులకు సోకుతుంది.జంతువుల నుండి ఇది మనుషులకు వ్యాపిస్తుంది.Ebola Viras సోకినా వ్యక్తుల యొక్క శరీరం లాలాజలం,రక్తం,చెమట లాంటివి నేరుగా మనం తాకడం వలన ఈ వైరస్ మనుషులకు ఒకరి నుండి ఒకరికి సోకె ప్రమాదం ఉంది.

Ebola Vairas లక్సనాలు 

.తీవ్రమైన జ్వరం రావడం

.విపరీతమైన తలనొప్పి, అలసట

.కండరాలు మరియు కీళ్ల నొప్పులు

.గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు

.శరీరంపై దద్దుర్లు రావడం

.వ్యాధి తీవ్రత పెరిగితే అంతర్గత రక్తస్రావం కావడం

లాంటి లక్షణాలు ముక్యంగా జ్వరం మరియు మలేరియా లాంటి లక్షణాలు పోలి ఉనప్పటికీ దీనిని మనం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది.అందుకే Shamshabaad Airport లో వైద్య నిపుణులు అక్కడ (CDC ) మార్గదర్శాల ప్రకారం స్సీర్నింగ్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలు పెట్టారు.

 

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్త 

Shamshabaad Airport లో మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇమ్మిగ్రేషన్ అధికారులతో మన ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.వేరే దేశాల నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల చరిత్ర పక్కాగా సేకరిస్తున్నారు.అయితే తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు ప్రయాణికులకువారి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం రూపంలో తప్పని సరిగా పొందుపర్చాలని అధికారులు సూచించారు.హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ మరియు నల్ల కుంట ఫీవర్ హాస్పిటల్ లో ఎయిర్పోర్ట్ లో అనుమానితంగా ఉన్న వారిని ఇక్కడ ఏర్పాటు చేసిన ఇసొల్యూషన్ కేంద్రాలకు పంపే విధంగా వార్డులను సిద్ధం చేశారు.అత్యవసర పరిస్థితిని ఎదుర్కునే అందుకు వైద్య సిబ్బందికి (PPE ) అంటే పెర్సనోల్ ప్రొటెక్టీవిటీ ఎక్విప్మెంట్ కిట్లను అలాగే అవసరమైన మందులను ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం లను కూడా వారు 24 గంటలు అందు బాటులో ఉండే విధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 

ఎబోలా వైరస్ వార్తలు ఇప్పుడు మన సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ చూసి భయపడ వద్దు ఎబోలా వైరస్ రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్ని ఎయిర్పోర్ట్ లో నిఘా పటిష్టం చేసాం ఎక్కడ నుంచి కూడా మన తెలంగాణ లోకి ఎబోలా వైరల్ ప్రవేశించ కుండా చర్యలు తీసుకుంటున్నాం.ప్రజలు ఎవరు కూడా భయ పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి.అని మంత్రి దామోదర రాజా నర్సింహా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

వ్యక్తిగత పరిశుభ్రతే శ్రీరామ రక్ష 

మనం ఎల్లప్పుడూ ఆరోగ్యాంగా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలి అలాంటప్పుడు ఎబోలా వంటి వైరస్ లు కూడా మన దగ్గరకు రావు అలాగే మన చుట్టూ ప్రక్కల ఉన్న అనారోగ్యం తో ఉన్న వ్యక్తుల కు దూరంగా ఉండడం మంచిది.అలాగే మనం బయటకు రద్దీ గ ఉన్నా ప్రదేశాలకు వెల్కలినప్పుడు మాస్క్ ధరించి వెళ్లడం మంచిది మంకు కొద్దీ పాటి అనారోగ్య లక్షణాలు కనిపించి నప్పుడు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చేయించుకోవడం మంచిది.

ముగింపు

Shamshabaad Airport లో ఎబోలా స్క్రీనింగ్ కట్టుదిట్టం చేయడంతెలంగాణ ప్రభుత్వ ముందుచూపుకు నిదర్శనం. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పౌరులుగా మనం కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉందాం. ఎబోలా లాంటి మహమ్మారిని ఉమ్మడిగా ఎదుర్కొందాం.

(మరిన్ని తాజా హెల్త్ అప్‌డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి.)

 

Leave a Comment